గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు రోజు కావడంతో రామయ్య సన్నిధికి భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వేకువజామునుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామయ్యను దర్శించుకుంటున్నారు. సీతారాముల నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిత్య కల్యాణ మహోత్సవంలో ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం జీలకర్ర బెల్లం, నూతన వస్త్రాలు సమర్పణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్