భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక శ్రీ హనుమత్ వారోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. మార్గ శుద్ధ త్రయోదశి సందర్భంగా ఉదయం హనుమంతునికి సుప్రభాత సేవ అనంతరం పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సామూహిక హనుమత్ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో సాయంత్రం దీపాలంకరణ వేడుకను నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు