ప్రతి ఏడాది హనుమాన్ జయంతి వేడుకలకు సందడిగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఈ ఏడాది కరోనా వల్ల బోసిపోయింది. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండటం వల్ల హనుమాన్ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
సింగరేణి మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్ దంపతులు, వర్క్‌షాప్ డీజీఎం నర్సిరెడ్డిలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.