భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సత్యసాయి దివ్యాంగుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో ప్రతిభ కనపరిచారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో రెండు రోజులపాటు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో క్యారమ్స్ విభాగంలో శిరీష ప్రథమ స్థానం, పరుగుపందెంలో ద్వితీయ స్థానం సాధించింది. షాట్పుట్ విభాగంలో ప్రేమ్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రీడాపోటీల్లో 32 జిల్లాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో గెలుపొందిన శిరీష, ప్రేమ్ కుమార్ను పాఠశాల నిర్వాహకుడు ప్రసాద్, శిక్షకురాలు రోజా అభినందించారు.
ఇవీ చదవండి..తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం