భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మహాలక్ష్మీ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 700 పేద కుటుంబాలకు బియ్యంతో పాటు 18 రకాల నిత్యావసర వస్తువులను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందించారు. లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు వీటిని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీటీసీ శ్రీలత హాజరయ్యారు. వారి చేతుల మీదుగా సరకులను అందించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేదలను ఆదుకునేందుకు ఇప్పటివరకు రెండు వేల క్వింటాళ్లకు పైగా బియ్యంతో పాటు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని ఎంపీ అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా లాక్డౌన్ పాటించాలని అన్నారు.
ఇవీ చూడండి: ముందస్తు చర్యల వల్లే నియంత్రించ గలిగాం: తలసాని