భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాచలంలోని తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు, న్యాయవాదులు, సామాజిక సేవ చేస్తున్న పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో పట్టణ సీఐ వినోద్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌లు పాల్గొని మహిళలను అభినందించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణించాలని.. అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని సూచించారు.