భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని చల్లా సముద్రం పంచాయతీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. క్వింటాకు రూ. 1760 నిర్ణయించి తేమశాతం 14గా నిర్ణయించారు.
రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు పండించే ప్రతి ధాన్యపు గింజలు కొంటామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. దీనిలో భాగంగానే తన నియోజకవర్గంలోనూ కేంద్రాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
ఆందోళన చెందకుండా రైతులు తమ ధాన్యాన్ని కూపన్లో ఇచ్చిన సూచనల ప్రకారం అమ్ముకోవాలని ఆమె సూచించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వారికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య