Governor in Bhadradri: భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. రామాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళిసైకి అర్చకులు వేదఆశీర్వచనాలు అందించారు. అంతక ముందు గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో ఈవో శివాజీ... స్వాగతం పలికారు. అనంతరం శ్రీరాముడి పట్టాభిషేకం వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌కు స్వాగతం పలకాల్సిన కలెక్టర్, ఎస్పీ గైర్హాజరయ్యారు. పట్టాభిషేక మహోత్సవానికి కూడా వారు హాజరుకాలేదు.
రెండురోజుల పర్యటన: భద్రాచలం దేవస్థానంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమం అనంతరం గవర్నర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో వనవాసి కల్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు కూడా గవర్నర్ హాజరవుతారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధిని సందర్శించి దాని పనితీరును సమీక్షిస్తారు.
ఇదీ చదవండి: Governor Tour: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ రెండ్రోజుల పర్యటన
ముల్లోకాలు మురిసేలా రాములోరి కల్యాణం... పులకించిన భద్రాద్రి