ETV Bharat / state

Gongadi Trisha: బంతితో, బ్యాట్‌తో రాణిస్తోన్న తెలంగాణ అమ్మాయి - తెలంగాణ వార్తలు

భారత మహిళల క్రికెట్‌ జాతీయ జట్టులో స్థానం తెలంగాణకు చెందిన యువ ఆల్‌రౌండర్‌ గొంగడి త్రిష దూసుకొస్తోంది. బంతితోనూ, బ్యాట్‌తోనూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాటుతో మైదానంలో చెలరేగిపోతున్న గొంగడి త్రిష... ఇండియా-బీ జట్టు తరపున అత్యధిక పరుగులు(Gongadi Trisha top scorer Under-19 World Cup) చేసిన బ్యాటర్​గా నిలిచింది.

Gongadi Trisha
Gongadi Trisha
author img

By

Published : Nov 27, 2021, 11:44 PM IST

అండర్ -19 వరల్డ్ కప్-2021 మహిళల బీ-జట్టుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ది సిరిస్​ త్రిష(cricketer Gongadi Trisha news) ఎంపికయ్యారు. బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రస్తుతం మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికకై ప్రత్యేక టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బీ, ఇండియా-సీ, ఇండియా-డీ జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్​లు నిర్వహించింది. ఇందులో ఇండియా-బీ జట్టుకు త్రిష ఆడారు. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్, బ్యాటింగ్​లో త్రిష మంచి గణాంకాలు నమోదు చేసి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ-2021లో త్రిష మంచి ప్రదర్శన(Gongadi Trisha latest news) కనబరిచారు.

ఈ నెల 2న ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్​లో ఓపెనర్​గా దిగి 158 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు బాదారు. ఇండియా-డీతో జరిగిన మ్యాచ్​లో 54 పరుగులు చేశారు. ఇండియా-డీతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 116 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు. 10 ఫోర్లు, 1సిక్సర్​తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. ఈ టోర్నీలో త్రిష మొత్తంగా 260 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా(Gongadi Trisha top scorer) నిలిచారు.

నాలుగేళ్లకే క్రికెట్‌ బ్యాటు చేతపట్టిన త్రిష...

త్రిష స్వస్థలం భద్రాచలం. పసి వయసులోనే ఆమె ఆసక్తిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పూర్తి సహకారాన్ని అందించారు. ఇంకేముంది నాలుగేళ్లకే క్రికెట్‌ బ్యాటు చేతపట్టిన త్రిష ఓ వైపు పాఠశాలకు వెళ్తూనే మరోవైపు గంటల తరబడి మైదానంలో సాధన చేసింది. ఎనిమిదేళ్లకే తెలంగాణ జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొని ఉమెన్‌ ఆఫ్‌ ది సిరిస్‌గా నిలిచిన ఘనత సొంతం చేసుకుంది. ప్రస్తుతం తను హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. సికింద్రాబాద్‌లో శిక్షణ తీసుకుంటూ అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా రాణిస్తోంది. బీసీసీఐ ఉమెన్‌ అండర్‌19, 23 తదితర టోర్నమెంట్‌లు ఆడి అనేక మ్యాచుల్లో ఉమెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతోంది. చదువు, క్రికెట్‌ రెండింటికి సమ ప్రాధాన్యం ఇస్తోంది ఈ యువ సంచలనం.

ఇదీ చదవండి: Revanth in Vari Deeksha: 'వరి కొనకపోతే.. నడిబజార్ల ఉరి తీయటం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.