ఎండాకాలం ప్రారంభంలోనే గోదావరి నీటిమట్టం కనిష్ట స్థాయిలో తగ్గిపోతోంది. ఎండ తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బుధవారం నీటిమట్టం కనిష్టంగా రెండు అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద మార్చిలో గోదావరిలో ఇంత తక్కువగా నీరు ఉండటం... ఇదే మొదటిసారి అని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు.
గోదావరి నదిపై భద్రాచలం ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టడంతోపాటు, యథేచ్చగా ఇసుకు తవ్వకాలు జరగడం వల్ల... భూగర్భజలాలు పడిపోతున్నాయని, నీటిమట్టం తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఎండలు పెరిగితే... భద్రాచలం ప్రజలకు తాగునీరు దొరకడం కష్టమని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి : చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు