సింగరేణి ఉనికిని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులు కూడా కృషిచేయాలని సింగరేణి ఇంచార్జి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలను కనుగొని నేటికి 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో గల జీఎం కార్యాలయంలో జెండాను ఆయన ఆవిష్కరించారు.
బొగ్గు గనులకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి పొందిన ఇల్లందులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు త్వరలోనే ఉపరితల గని విస్తరణ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 106 హెక్టార్ల పరిధిలోని చెట్లను లెక్కింపు చేసి అటవీశాఖ అధికారులకు వివరాలు అందించామని పేర్కొన్నారు. ఉపరితల గని విస్తరణతో సింగరేణి మనుగడ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సింగరేణికి మరో వందేళ్ల సుస్థిర భవిష్యత్తు : సీఎండీ శ్రీధర్