భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ తెలంగాణ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక ఛైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్, పురపాలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
![gandhi jayanthi celebrations in illandhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-03-02-gandhijayanthivedukalu-ab-ts10145_02102020114951_0210f_00649_240.jpg)
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గాంధీచౌక్‌లో మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.