భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ అధికారులు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో నరసింహులు ప్రారంభించారు.
నేటి నుంచి మే నెల వరకు భక్తులకు మజ్జిగను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు 4 వందల లీటర్ల నుంచి 5 వందల లీటర్ల వరకు మజ్జిగను భక్తులకు అందించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: డెత్ వారెంట్‌పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్