ETV Bharat / state

Palle pragathi: ముగిసిన నాలుగో విడత.. అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి ఆరా.! - గుండాలలో మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఈ రోజు ముగిసింది. గ్రామాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం విడతల వారీగా కొనసాగుతోంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పెండింగ్​లో ఉన్న పనులు, ప్రకృతి వనాలను పదిరోజులపాటు అభివృద్ధి పరిచారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, పువ్వాడ అజయ్​ కుమార్ పాల్గొన్నారు.

palle pragathi
పల్లె ప్రగతి
author img

By

Published : Jul 10, 2021, 7:27 PM IST

రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం ఈ రోజు ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పాల్గొన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం, మిషన్​ భగీరథ, ఇతర విభాగాల పనితీరుకు సంబంధించి అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాల పరిశుభ్రత కోసం సంబంధిత వర్గాలకు నోటీసులు అందజేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. నోటీసులు ఉల్లంఘించిన వారిని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులను కొంతకాలం నిలిపివేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానా విధించాలని సూచించారు. ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచకుండా ఆయా స్థలాల్లో మొక్కలు నాటి స్వచ్ఛతను పెంపొందించాలని సూచించారు.

మూడు రోజుల్లోగా

వైకుంఠధామాలకు మిషన్ భగీరథ నీరు అందించకపోవడంపై సంబంధిత అధికారిపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ మిషన్​ భగీరథ నీటిపై వివరాలు తెలుసుకున్నారు. మూడు రోజుల్లో మండలంలో అన్ని ప్రాంతాలకు ఇంటింటికీ మంచి నీటి కనెక్షన్లు పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంతో.. 3 రోజుల్లో పనులు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి మంత్రి పువ్వాడతో కలిసి సీఎం కేసీఆర్​తో చర్చిస్తానని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటులో కాకుండా.. ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తామని హామీ ఇవ్వాలని కోరడంతో స్థానికులు మద్దతు తెలిపారు.

చిన్న మొక్కలు నాటొద్దు

తాను పదే పదే చెప్పినప్పటికీ అధికారులు.. రహదారుల వెంట చిన్న మొక్కలను నాటుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. పది అడుగులు ఉండే పెద్ద మొక్కలను నాటాలని, చిన్న మొక్కలను మరో ప్రాంతంలో నాటాలని జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్​ను ఆదేశించారు. ప్రతి రోజూ పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ వస్తుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధుకు సంబంధించి పలు వివరాలను నేరుగా వారిని అడిగి తెలుసుకున్నారు.

సంక్షేమ పథకాలు ఆగలేదు

గుండాల అభివృద్ధికి రూ. 25 లక్షల నిధులతో సీసీ రహదారులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్​ ఎలాంటి సంక్షేమ పథకాలు నిలిపివేయలేదని వివరించారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి గతంలో రెండు అదనపు మండలాలు ఏర్పాటు చేసి ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రైతు వేదికల ప్రారంభోత్సవం, కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: Nomula bhagath: యాదగిరి పొలం పనుల్లో ఎమ్మెల్యే నోముల భగత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.