భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుతో ఆవిష్కరించారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేమని తుమ్మల అన్నారు.
అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రాశారని చెప్పారు. ఆ మహనీయుడు చూపించిన మార్గంలో అందరూ నడుచుకోవాల్సిన అవసరముందన్నారు. అంబేడ్కర్ వల్లే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే నాగేశ్వర రావు అన్నారు.
ఇదీ చదవండి: అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి అంబేడ్కర్: హరీశ్ రావు