ETV Bharat / state

Tension in FRO Srinivasa Rao Funeral : ఎఫ్​ఆర్​వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత - ఎఫ్​ఆర్వో శ్రీనివాసరావు హత్య

Forest Officers Protest in Khammam : ఎఫ్​ఆర్​వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరైన మంత్రులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. తమపై ఎన్నిదాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

FRO Srinivasa Rao funeral
ఎఫ్​ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు
author img

By

Published : Nov 23, 2022, 2:03 PM IST

ఎఫ్​ఆర్​వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత

Forest Officers Protest in Khammam : ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో ఎఫ్​ఆర్​ఓ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అంత్యక్రియలకు హాజరైన మంత్రులను అటవీ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. గుత్తికోయల దాడుల నుంచి రక్షించాలని కోరారు. మంగళవారం రోజున గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఎఫ్​ఆర్​వో శ్రీనివాసరావు అంత్యక్రియలు నేడు ప్రభుత్వలాంఛనాలతో నిర్వహించారు. శ్రీనివాసరావు అంత్యక్రియల్లో మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, పువ్వాడ అజయ్​ పాల్గొని పాడె మోశారు.

Forest Officers Protest at FRO Funeral : తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు, సిబ్బంది మంత్రుల ఎదుట వాపోయారు. ఛత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించుకున్నారు. కాసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఆయుధాల అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

అసలేం జరిగింది: చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు మంగళవారం ఉదయం పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారి శ్రీనివాసరావు పై మూకుమ్మడిగా దాడికి యత్నించారు. మొక్కలు తొలగించవద్దని చెప్పే లోపే అక్కడే ఉన్న శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.