భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంజనాపురం గ్రామానికి చెందిన అటవీశాఖ బీట్ అధికారి భూక్య ఉపేందర్ ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం విధులు నిర్వహిస్తున్న క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత నాలుగు రోజుల నుంచి ఉన్నతాధికారులు వేధిస్తున్నారని తెలిపారు. వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఉపేందర్ భార్య లలిత, సోదరుడు ధర్మ చెబుతున్నారు. ప్రస్తుతం ఉపేందర్ భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి : మిమిక్రీ కళాకారుడు హరికిషన్ ఇకలేరు