మత్స్యకారుల జీవనాభివృద్ధిని పెంపొందించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి 2,17,500 చేప పిల్లలను విడుదల చేశాారు.
గిరిజన మత్స్య సొసైటీ, మత్స్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జెడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీపీ కోదండ రామయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఈత కొడదాం.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..