రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి వర్షపాతం తగ్గుముఖం పట్టింది. క్రమంగా భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. మొదటిసారి 62 అడుగులు దాటిన గోదావరి నీరు.. రెండోసారి 55 అడుగులకు చేరింది.
అక్కణ్నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోన్న నీటిమట్టం సోమవారం ఉదయం 8 గంటలకు 43 అడుగుల వద్దకు చేరింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
- ఇవీచూడండి: మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం