ETV Bharat / state

ఏజెన్సీలో ఎదురుకాల్పులు.. మావోయిస్టులకై పోలీసుల వేట - maoists latest news

కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో మళ్లీ తూటా పేలింది. తెలంగాణలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న మావోలు.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెరసి.. మరోసారి తుపాకులు గర్జించాయి. మణుగూరు ఏరియా అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

firing between maoists and police in badradri kothagudem district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాల్పుల కలకలం
author img

By

Published : Jul 15, 2020, 7:22 PM IST

Updated : Jul 15, 2020, 8:35 PM IST

తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలపై గత కొద్దిరోజులుగా దృష్టి సారించారు. ఏజెన్సీ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయటంతోపాటు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల బృందం పోలీసులకు తారసపడినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమయంలోనే పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు.

అమరవీరుల వారోత్సవాలు

మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 15 మంది మావోల బృందం పాల్గొన్నట్లు తెలిసింది. వీరితోపాటు మరికొంత మంది మావోయుస్టులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మావోలు వ్యూహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఛత్తీస్​గఢ్ నుంచి గోదావరి నది మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

గాలింపు చర్యలు ముమ్మరం

మణుగూరు అటవీ ప్రాంతాలను సేఫ్ జోన్​గా భావించి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం వల్ల మావోయిస్టులు మళ్లీ ఛత్తీస్​గఢ్​లోకి వెళ్తారనే సమాచారంతో... ఏజెన్సీలోని సరిహద్దు ప్రాంతాలపై పూర్తిగా పోలీసులు దృష్టి సారించారు. మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, పినపాక, ఏడూళ్ల బయ్యారం ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలపై నిఘా మరింత పెంచి మావోల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఏజెన్సీలోని చర్ల, దుమ్ముగూడెం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం ప్రాంతాలన్నీ ఛత్తీస్​గఢ్ దండకారాణ్యాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలు కావడం వల్ల పోలీసులు మరింత అప్రమత్తయ్యారు. మణుగూరు అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులతో సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చూడండి : గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

Last Updated : Jul 15, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.