ETV Bharat / state

పదవి కోసం పట్టు.. సర్వసభ్య సమావేశంలో గందరగోళం - సుజాతనగర్ ఎంపీడీవో కార్యాలయం

ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఒప్పందం ప్రకారం పదవి దక్కలేదని వైస్ ఎంపీపీ సమావేశాన్ని అడ్డుకోగా గొడవకు దారితీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​లో జరిగింది.

fight in Meeting
ఎంపీడీవో కార్యాలయంలో గొడవ
author img

By

Published : Mar 31, 2022, 8:40 PM IST

ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం రసాభాస

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు ఎంపీపీగా అవకాశం ఇవ్వడం లేదంటూ మహిళా వైస్ ఎంపీపీ ఆందోళనకు దిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీంతో సమావేశం గందరగోళానికి దారితీసింది. అయితే ఒప్పందం మేరకు తనకు ఆకాశం కల్పించడం లేదని వైస్ ఎంపీపీ బానోతు అనిత సభను అడ్డుకోవడం వల్ల రసాభాసగా మారింది.

ప్రస్తుతం ఎంపీపీగా కొనసాగుతున్న విజయలక్ష్మి తనకు రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని చూపిస్తూ బానోతు అనిత గొడవకు దిగారు. రెండున్నర సంవత్సరాల తర్వాత తనకు అవకాశాన్ని కల్పిస్తానని ఒప్పుకుని ఇప్పుడేమో ఇవ్వమని మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం సర్వసభ్య సమావేశానికి సంబంధించింది కాదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు సమావేశంలో ప్రస్తావించడం ఎంపీపీ, వైస్ ఎంపీపీకి తగదని సభ్యులు మండిపడ్డారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయగా గొడవ సద్దుమణిగింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.