భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు రైతులు ఆందోళనకు దిగారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రామంలోని రహదారిపై ధాన్యం బస్తాలతో బైఠాయించి నిరసన తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో గత నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు సాగటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!