ETV Bharat / state

పరిహారం కోసం రైతులు ధర్నా... 14 మంది అరెస్టు - Farmers agitation for Compensation in Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన 14మంది రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు గనికి వెళ్లే దారిలో వారికి ఇబ్బందులను సృష్టించారు. ఈ కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి స్టేషన్​కు తరలించారు.

పరిహారం కోసం రైతులు ధర్నా...14 మంది అరెస్టు
author img

By

Published : Jul 8, 2019, 11:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పరిహారం చెల్లించాలని ధర్నా చేసిన 14 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజుపేట గ్రామం వద్ద గనికి వెళ్లే రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రహదారిపై చెట్లు వేసి రాకపోకలకు ఇబ్బందులు కల్గించారు. సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 14మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అధికారులు, రైతుల భిన్న వాదనలు

రైతుల ఆందోళన నేపథ్యంలో.. సింగరేణి, రెవెన్యూ అధికారులు రైతుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులకు అసలు భూమి లేదని సింగరేణి, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. తమ భూమిలోకి అధికారులు వచ్చి అబద్ధాలు చెప్తున్నారని రైతులు వాపోయారు. గతంలో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో భూమి మీద సర్వే చేసి పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అసలు భూమి తమది కాదని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టి రైతులను జైలుకు పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పరిహారం కోసం రైతులు ధర్నా...14 మంది అరెస్టు

ఇవీచూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

Intro:14 మంది రైతుల పై కేసు నమోదు

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో పరిహారం చెల్లించాలని ధర్నా చేసిన 14 మంది రైతులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మణుగూరు సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో భూములు కోల్పోయి పరిహారం పొందని కొంతమంది రైతులు పరిహారం చెల్లించాలని కోరుతూ రాజు పేట గ్రామం వద్ద గనికి వెళ్లే రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రహదారిపై చెట్లు వేసి ఇ రాకపోకలు సాగించే కుండా డా రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో సింగరేణి అధికారుల విధులకు , తన పనులకు ఆటంకం ఏర్పడిందని గని ప్రాజెక్ట్ అధికారి లలిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె రమేష్ బాబు ఉ 14 మంది రైతుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అధికారులు, రైతుల భిన్న వాదనలు రైతుల ఆందోళన నేపథ్యంలో సింగరేణి రెవెన్యూ అధికారులు రైతుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులకు అసలు భూమి లేదని సింగరేణి ,రెవెన్యూ అధికారులు వాదిస్తుంటే, మరో వైపు మా భూమి లోకి వచ్చి భూమి కాదని అధికారులు అబద్ధం చెప్తున్నారని రైతులు వాదిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టి చేసిన నేపథ్యంలో భూమి మీద సర్వే చేసి పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ, సింగరేణి అధికారులు హామీ ఇచ్చారని ఇప్పుడు అసలు భూమి మాది కాదని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 853 సర్వే నంబర్లు 18 ఎకరాలు 160/22 సర్వే నబర్లూ మరో రెండు ఎకరాలు, మొత్తం 20 ఎకరాల సింగరేణి రైతులు తెలియజేస్తున్నారు.

Conclusion:పరిహారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టి రైతుల జైలుకు పంపించడం ఏంటని ఇదెక్కడి న్యాయం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న భూమిని సింగరేణి తీసుకొని ఎలా బతకాలో తెలియక ఉంటున్న మాపై అక్రమ కేసులు బనాయించి అధికారులు రైతులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.