ETV Bharat / state

'ధాన్యం అమ్మేందుకు వచ్చి అనంతలోకాలకు' - sun stroke

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో పునేం కృష్ణ అనే రైతు వారం రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోస్తున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో మృతి చెందాడు.

వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో మృతి చెందిన రైతు
author img

By

Published : Apr 17, 2019, 9:51 AM IST

ధాన్యం అమ్మేందుకు మార్కెట్ యార్డుకు వచ్చిన రైతు వడదెబ్బతో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో చోటుచేసుకుంది. సత్యంపేట గ్రామానికి చెందిన పునేం కృష్ణ అనే రైతు వారం రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోస్తున్నాడు.
రేపో మాపో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారని భావించిన కృష్ణ మధ్యాహ్నం సమయంలో మరోసారి ధాన్యం ఆరబోస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో కృష్ణ మృతి చెందాడు.

ధాన్యం ఆరబోస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన రైతు

ఇవీ చూడండి : 'భద్రత విషయంలో చింతించాల్సిన పనిలేదు'

TG_MBNR_6_16_YATHRIKUALA_RASTHAROKO_AV_C8 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:9885989452 ( )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమలలో అమరనాథ్ సలేశ్వరం జాతర కు ఇంకా సమయం ఉందని అడవి లోపలికి పోవడానికి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదని అటవీశాఖ అధికారులు భక్తులకు తేల్చిచెప్పడంతో అసహనానికి గురైన భక్తులు రాస్తారోకో చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ నల్లమల అడవిలో ప్రతి ఏడు సలేశ్వరం జాతర మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తారు. జాతర ఈనెల 17 నుంచే అనుకొని ఒక రోజు ముందు నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద అటవీ లోపలికి ప్రవేశించడానికి అటవీశాఖ సిబ్బంది అడ్డుకున్నారు. సలేశ్వరం జాతర 18, 19, 20 తేదీలలో ఉందని ఇప్పటి నుంచి అడవి లోపలికి వెళ్లడానికి అనుమతులు లేవని ఎవరికీ ప్రవేశం కల్పించమని అటవీ శాఖ సిబ్బంది ఖరాఖండీగా చెప్పడం తో వేలాదిగా వచ్చిన యాత్రికులు అసహనానికి కోల్పోయి అటవీశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.సహనానికి కోల్పోయిన యాత్రికులు చెక్ పోస్ట్ ను ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చివరికి పోలీసుల జోక్యంతో యాత్రికులు వెనక్కి వెళ్లారు.....AV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.