భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు పొలంలో పని చేసుకుంటున్న రైతు, రెండు ఎద్దులు మృతి చెందాయి. దోమల సుందర్ తన పత్తి చేనులో దుక్కి దున్నుతున్నారు. భారీగా వర్షం పడుతున్నా పొలంలో పని చేశాడు. ఒక్కసారిగా పడిన పిడుగుకు సుందర్, రెండు ఎద్దులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చదవండిః ప్రశాంతంగా డీసెట్ రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన