భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన బిజ్జం కృష్ణారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని.. వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తానని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాగా కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
ఇదీ చదవండి: నవవధువు ఆత్మహత్యాయత్నం... భార్యాభర్తల మధ్య గొడవే కారణం!