ETV Bharat / state

pest management: ఆమె ఆలోచన... రైతు సమస్యలకు పరిష్కారం

సాగు సమయంలో పంటకు నష్టం కలిగించే పురుగుల నివారణకు పరిష్కారం కనుగొంది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని సీహెచ్‌ దివ్యశ్రీ. ఆమె తయారు చేసిన సోలార్‌ కంట్రోల్‌ ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంకు జేఎన్‌టీయూ గుర్తింపు లభించింది. తాను రూపొందించిన పరికరంతో పత్తి, వరి, మిరప పంటలపై ప్రయోగాలు చేసి ఔరా అనిపిస్తోంది.

engineering student sri divya
engineering student sri divya
author img

By

Published : Jun 24, 2021, 11:00 PM IST

ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ (EEE) తృతీయ సంవత్సరం చదువుతున్న సీహెచ్​ దివ్యశ్రీ... పంటలకు నష్టం కలిగించే పురుగుల నివాణకు పరిష్కారం కనుగొంది. ఆమె రూపొందించిన పరికరానికి జేఎన్​టీయూ గుర్తింపు లభించింది. ఏడాది జేహబ్‌ ద్వారా జేఎన్టీయూ గుర్తించిన ఐదు ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్టుకు రెండో స్థానం దక్కింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అతితక్కువ ధరకే సోలార్‌ ప్యానెళ్లు అందించే అవకాశం ఉందని విద్యార్థిని చెబుతోంది.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే...

ఏడాది క్రితం ఇన్నోవేషన్​ యాత్రకు వెళ్లిన సందర్భంలో ప్రతి ఒక్కరు ఐదు సమస్యల గురించి తెలుసు కోవాలి. ఆక్రమంలో నేను రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నాను. ప్రధానంగా చీడపీడలను నివారించేందుకు ఎరువులు, పురుగు మందులు ఎక్కువ మొత్తంలో వాడుతున్నట్లు గుర్తించాను. ఆ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటుందా అనే ఆలోచన నుంచి పుట్టుందే సోలార్‌ కంట్రోల్‌ ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం.- దివ్యశ్రీ, విద్యార్థిని.

ఈ యంత్రం ఎలా పనిచేస్తోందంటే..

పంట పూత దశలో ఉన్నప్పుడు పుష్పాలపై ఎక్కువగా పురుగులు చేరి పాడు చేస్తాయి. దానివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ఆ సమయంలో పంట పొలాల్లో ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ఒక ఎకరాలో నాలుగు సోలార్​ ప్యానెళ్లు ఏర్పాటు చేసి.. వాటికి బల్పులు అమర్చినట్లైతే రాత్రి సమయంలో పురుగులు కాంతికి ఆకర్షితమై బల్పు వద్దకు వచ్చి... వేడికి చనిపోతాయి. అవి కిందపడిపోకుండా ఒక తొట్టెను ఏర్పాటు చేస్తే అందులో పడిపోతాయి. వాటిని మరళా సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. ఈ విధంగా సౌర శక్తితో చీడపీడలను అరికట్టవచ్చు.

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా..

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితిసేందుకు తమ కళాశాలలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కళాశాల యాజమాన్యం చెబుతుంది. ఏటా పలువురి విద్యార్థుల ఆలోచనలకు కావాల్సిన సాంకేతికతను విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కళాశాల ఛైర్మన్​ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో చాలా వినూత్న ఆలోచనలు ఉంటాయి. వారిలో దాగున్న ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మంత్రి కేటీఆర్​ స్ఫూర్తితో చేపట్టిన యాత్ర కార్యక్రమంలో మా కళాశాలల నుంచి 18 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మా కళాశాల విద్యార్థిని ఆలోచనతో రూపొందించిన పరికరానికి జేహబ్​లో ద్వితీయ స్థానం దక్కింది. రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -నవీన్‌కుమార్‌, ప్రియదర్శిని విద్యాసంస్థల ఛైర్మన్‌.

వ్యవసాయం పెట్టుబడి పెరిగిన రోజుల్లో ఉత్పత్తి ఖర్చు తగ్గించటంలో ఈ పరికరం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విద్యార్థిని పేర్కొంది. సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని దివ్యశ్రీ చెప్పుకొస్తోంది. జేఎన్టీయూ స్థాయిలో మొదటి ఐదు స్థానాల్లో చోటు సంపాదించటం ఆనందంగా ఉందని కళాశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Vasalamarri: సీఎం కేసీఆర్​తో భోజనం చేసిన ఆగమ్మకు అస్వస్థత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.