భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సుబ్బంపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ పనుల్లో భాగంగా కరెంట్ స్తంభాలకు వీధిదీపాలు అమర్చుతున్న కారం రాజు విద్యుదాఘాతంతో స్తంభంపైనే మరణించాడు. ఒక్కసారిగా విద్యుత్ ప్రసారమై ప్రమాదం సంభవించింది. మృతదేహం కరెంటు స్తంభంపైనే ఉండటం వల్ల.... తోటి కార్మికులు తాడు సహాయంతో కిందకు దించారు. విషయం తెలిసిన రాజు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్