రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పలు కార్యక్రమాలు నిలిపేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహులు ప్రకటించారు. రేపటి నుంచి నిత్య కల్యాణం, అంతరాలయంలో అర్చనలు, అభిషేకాలు, అన్నదానం, మజ్జిగ పంపిణీ నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులు లేకుండానే కల్యాణం
ఈనెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2న స్వామివారి కల్యాణం, 3న మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులను అనుమతించబోమని అర్చకులు, వేద పండితుల నడుమ ఈ క్రతువు జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: భారత్లో 151కి చేరిన కరోనా కేసులు- అంతటా బంద్