భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మద్యం తాగిన ఓ వ్యక్తి తనకు చికిత్స చేయాలంటూ వచ్చాడు. మద్యం సేవించిన యువకుడు అప్పటికే దగ్గుతూ, జ్వరంతో ఉండగా.. కరోనా వార్డుకు తరలించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్లాక పరీక్షలు చేస్తామన తెలుపగా.. తాను కేవలం దగ్గుతుంటే కరోనా ఉందని ఎలా నిర్ధరిస్తారంటూ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగాడు.
మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు ఆసుపత్రి సిబ్బందిని తీవ్రంగా దూషించాడు. దాడికి యత్నించగా.. సిబ్బంది గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఆ యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతున్నందున వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు.