ETV Bharat / state

oxygen concentrator: ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల విరాళం - వాసవి సేవా ఫౌండేషన్

కరోనా బాధితులను ఆదుకునేందుకు, ప్రాణ వాయువు అందించేందుకు జిల్లాల వారీగా దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రధాన ఆసుపత్రికి వాసవి సేవా ఫౌండేషన్(usa california) ఆధ్వర్యంలో నాలుగు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrator)ను ఎమ్మెల్యే హరిప్రియ(mla hari priya), ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు.

Donation of oxygen concentrators
oxygen concentrator: ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సాన్​ట్రేటర్ల విరాళం
author img

By

Published : Jun 5, 2021, 4:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వాసవి సేవా ఫౌండేషన్(usa california)వారి సహకారంతో… నాలుగు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrator)ను ఇల్లందు ప్రధాన ఆసుపత్రికి ఎమ్మెల్యే హరిప్రియ(mla hari priya), ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రెండు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు చేరాయి.
కొవిడ్​ బారిన పడి ఆక్సిజన్ సౌకర్యం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని… ఐసోలేషన్ కేంద్రం ద్వారా వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.

కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాల అంత్యక్రియల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం… పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతిమ యాత్ర కోసం ఓ వాహనం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే ఒక జేసీబీ కూడా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.