భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పంచాయతీల్లో జరుగుతున్న ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా ఓ ఇంటికి వెళ్లి ఆన్లైన్ తరగతులు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీతారాంపురం గ్రామ సర్పంచ్ సుశీల నిబంధనలకు విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేసినందుకు ఆమెను పంచాయతీ సర్పంచ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎంతటి వారైనా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్