రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో కేవలం 9,019 చీరలను మూడు సెంటర్లలో పంపిణీ చేసినట్లు తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ అరకొరగానే ఉందన్నారు. నియోజకవర్గంలోని మహిళలందరికీ చీరలు రాలేదని కొందరికి మాత్రమే అందినట్లు వివరించారు.
ఇవీ చూడండి : "తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలి"