భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇటీవల వరుస వర్షాలకు తడిసి ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల భవనం ప్రవేశ మార్గం వద్ద పైకప్పు కుప్పకూలింది. కొవిడ్ అనుమానితులకు ఈ భవనంలోనే పరీక్షలు చేస్తున్నారు. పై కప్పు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. కొద్ది రోజులుగా వర్షాలకు తరచూ పైకప్పు పెచ్చులూడిపడుతున్నా అధికారులు స్పందించలేదు. మున్ముందు ఎలాంటి ప్రాణనష్టం జరగక ముందే అధికారులు స్పందించాలని, వెంటనే కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి