ETV Bharat / state

Devotees rush in temples: భద్రాద్రి, యాదాద్రిలో కార్తిక శోభ.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు - devotees rush in bhadradri on sunday

కార్తిక మాసం సహా ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో(Devotees rush in telangana temples) కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భద్రాద్రి రామయ్య, యాదాద్రి లక్ష్మీ నారసింహుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక దీపారాధన జరిపించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

rush in yadadri, bhadradri
యాదాద్రి, భద్రాద్రి
author img

By

Published : Nov 28, 2021, 12:46 PM IST

Updated : Nov 28, 2021, 12:54 PM IST

Devotees rush in temples: కార్తిక మాసం చివరి వారం, ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. కార్తిక దీపారాధనలు చేసేందుకు మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య(Devotees rush in Bhadradri temple) సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి తరలిరావడంతో ఆలయంలోని క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కార్తిక మాసం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.

rush in yadadri, bhadradri
రామయ్య నిత్య కల్యాణోత్సవంలో భక్తుల రద్దీ

బేడా మండపంలో జరిగే సీతారాముల నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మాడవీధులు, ప్రసాదం కౌంటర్లు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

rush in yadadri, bhadradri
రామయ్య దర్శనానికి క్యూలైన్లలో భక్తులు

నారసింహుని సన్నిధిలో

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Devotees rush in Yadadri temple) సన్నిధిలో కార్తిక శోభ నెలకొంది. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. దర్శన, లడ్డూ ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది.

rush in yadadri, bhadradri
యాదాద్రిపై భక్త జన సందోహం

వ్రతాలు, పూజలు

బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తిక మాసం కావడంతో సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తిక దీపారాధన జరిపించడం కోసం భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రీశుని సన్నిధికి వచ్చారు. ఆలయ పునఃనిర్మాణ పనులు, మరోవైపు భక్తుల రద్దీ కారణంగా పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.

rush in yadadri, bhadradri
బాలాలయంలో నారసింహుని నిత్య కల్యాణోత్సవంలో భక్తుల రద్దీ

కరోనా మూడో దశ(corona third wave) ముప్పు పొంచి ఉండటం వల్ల ప్రధాన ఆలయాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. థర్డ్ వేవ్ మొదలవుతున్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు.

ఇదీ చదవండి: manjunatha temple history: వైష్ణవులు పూజించే శివాలయం... ఎక్కడో తెలుసా?

Last Updated : Nov 28, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.