భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే అధికసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి బంగారు పుష్పాలతో అర్చన వైభవంగా చేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.