భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు (Devi Sharan Navaratri celebrations) వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో (Devi Sharan Navaratri celebrations) మొదటి రోజైన నేడు అమ్మవారు... ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో ఆలయ అధికారులు నేటి నుంచి ఈ నెల 15 వరకు శ్రీ మద్రామాయణ పారాయణ మహా క్రతువును నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం బాలకాండ పారాయణం జరుగుతోందని నిర్వాహకులు వెల్లడించారు.
ఉదయం ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి... సూర్యప్రభ వాహనంలో వేంచేపు చేసి రామాయణ పారాయణం నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకల్లో (Devi Sharan Navaratri celebrations)భాగంగా లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలంకరణ అనంతరం అమ్మవారు ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం దర్బార్ సేవ అనంతరం లక్ష్మణ సమేత సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: engili pula bathukamma: ఎంగిలి పూలతో బతుకమ్మకు స్వాగతం.. తెలంగాణలో ప్రతి ఇంటా కోలాహలం