భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో లక్ష్మీ తాయారు అమ్మవారు అష్టలక్ష్ములుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదవ రోజైన బుధవారం లక్ష్మీ తాయారు అమ్మవారు... ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. లక్ష్మీ తాయారు అమ్మవారు గురువారం విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
- ఇదీ చూడండి: బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు