భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పదో రోజైన నేడు అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మీ తయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం చేసి.. సువర్ణ పుష్పాలతో అర్చన జరిపించారు.
ఇదీ చూడండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు