భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అశ్వరావుపేటలోని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. విద్యార్థులను ఆటోలోనూ, మినీ లారీల్లోనూ కిక్కిరిసేలా ఎక్కిస్తున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ రహదారిలో ఆటోలో తరలించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులను తరలించేందుకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లిస్తోంది. అయినప్పటికీ నిధులు సరిపోవడం లేదని ప్రిన్సిపల్ పీవీఎన్ పాపారావు తెలిపారు. జాతీయ రహదారిపై విద్యార్థులను ఆటోలో తరలించడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను తరలించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ