Irregularities in Bhadrachalam MRO Office : వ్యవస్థలోని ఏ రంగమైనా దళారుల కనుసన్నల్లోనే నడవడం పరిపాటిగా మారింది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులే.. వారితో చేతులు కలిపి బేరసారాలకు దిగుతున్న ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు కావాలని.. మధ్య దళారులను ఆశ్రయిస్తేనే ధ్రువీకరణ పత్రాలు(Validation Documents) చేతికి వస్తున్నాయి.
కాసులు చెల్లించలేని కటిక పేదవారిని.. అక్కడ అధికారుల నుంచి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న దళారులు సైతం పట్టించుకోరు. అదే డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు త్వరగా పనులు జరిగితే చాలు అనుకుంటే.. అర నిమిషంలో కార్యాలయ సిబ్బంది(Office Staff), దళారులు సైతం కాసుకొని కూర్చుంటారు. నిరుపేదలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని చెప్పులు అరిగే దాకా తిరిగినప్పటికీ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత సమయంలో రావడం లేదు.
Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు
సామాన్య ప్రజలు ధ్రువీకరణ సర్టిఫికేట్ల కోసం భద్రాచలం ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటే.. నిర్ణీత సమయంలో వచ్చే పరిస్థితులు కనపించడం లేదు. అటువంటి సర్టిఫికెట్లను వేగంగా ఇప్పించేందుకు.. ప్రజల అవసరాలను అవకాశంగా మలుచుకొని మధ్య దళారులు దందా నడుపుతున్నారు. ఒక్కో ధ్రువపత్రానికి ఒక్కో రేటు పెట్టుకొని అడ్డగోలుగా అక్రమ ఆర్జన చేస్తున్నారు.పేద ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు లేవు. ఇకనైనా దీనిపై రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. - గడ్డం స్వామి, సీపీఎం నాయకుడు
Revenue Officers Mafia in Bhadradri Kothagudem : అదే మధ్య దళారులు ఆదాయ ధ్రువీకరణ పత్రానికి రూ.2000, కుల ధ్రువీకరణ పత్రానికి రూ.3000 నుంచి 5000 తీసుకొని ఒకే రోజులో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగలుగుతున్నారంటే దళారీ వ్యవస్థను ఎంతగా పోషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి నిరోధక శాఖ(Anti-corruption Department) జరిపిన దాడుల్లో ఇదే కార్యాలయంలో పని చేసే సిబ్బంది లంచం తీసుకుంటూ పట్టుబడినా.. ఇక్కడ సిబ్బందికి బుద్ధి రాలేదనే చెప్పాలి.
దళారులకు కార్యాలయ సిబ్బంది.. సహకారం ఉండటంతో వారి దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రానికి వచ్చే సామాన్యులను సైతం తమ మాయమాటలతో మభ్యపెడుతూ.. వారి అవసరాన్ని మనీగా మలుచుకుంటున్నారు. అంతేకాక కొన్ని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇప్పించి ఇటు ప్రజలను.. అటు ప్రభుత్వాన్నీ తప్పుదారి పట్టిస్తున్నారని సమాచారం.
భద్రాచలం తహసీల్దార్ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకున్న కొందరు దళారులు.. అక్కడ రెవెన్యూ అధికారుల అండతో దందాకు దిగుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన సామాన్యులు క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తే.. దళారులు మాత్రం యథేచ్ఛగా లోపలికి వచ్చి ఆన్లైన్ చేయించుకుంటున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో నేరుగా అధికారులకు అప్పగించి.. ఒక్క రోజులోనే ఆమోదింపజేసుకుంటున్నారు. ఈ దళారులను రెవెన్యూ అధికారులే ప్రోత్సహించడం జరుగుతుంది.- ముద్ద పిచ్చయ్య, దళిత సంఘం నాయకుడు
ఫారం 16 లేకున్నా ఐటీ రిటర్న్స్ దాఖలు.. గడువు పొడిగిస్తారా?
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్ సర్టిఫికెట్తో పాటు ఆధార్