రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కోట్లు వెచ్చించి చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణాలు పంపిణీ చేయకముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలో లోతట్టు ప్రాంతంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. వర్షాకాలంలో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇవి నిరుపయోగంగా పడి ఉండటంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. నాణ్యత లోపం వలన పంపిణీ చేయకముందే గోడలలో పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిని నిర్మించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా... లబ్ధిదారులకు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ఇల్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు