ETV Bharat / state

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు రైతులకు ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. 2005 సంవత్సరం కంటే ముందు ఉన్న భూములను అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాల్సిందేనని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ... అటవీ స్థలాల సంరక్షణ పేరిట అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో రైతులకు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

CPIML New Democracy rally in support of Podu farmers in Kottagudem district
పోడు భూములకు పట్టాలివ్వాలి
author img

By

Published : Jan 12, 2021, 10:54 AM IST

పోడు రైతులకు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 సంవత్సరం కంటే ముందు ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఎఫ్​డీవో అనిల్ కుమార్​కు వినతిపత్రం అందజేశారు.

అటవీశాఖ అధికారులు, సిబ్బంది రైతులపై అక్రమ కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములలో అటవీశాఖ ఆక్రమణలు ఆపాలని... అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా నాయిని రాజు, తుపాకుల నాగేశ్వరరావు, అజ్మీర్ బిచ్చ సారంగపాణి, కొమరారం సర్పంచ్ కృష్ణవేణి నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నాలాంటి భార్యే కావాలట: శ్రుతి హాసన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.