ETV Bharat / state

భద్రాద్రి జిల్లాలో ఘనంగా సీపీఐ​ ఆవిర్భావ దినోత్సవం - భద్రాద్రి జిల్లోలో ఘనంగా సీపీఐ​ ఆవిర్భావ దినోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమ్యూనిస్టు నాయకుడు లెనిన్ 151 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ ఎంఎల్​ న్యూడెమోక్రసీ, ఐఎఫ్​టీయూ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు.

సీపీఐ
సీపీఐ
author img

By

Published : Apr 22, 2021, 12:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో సీపీఐ ఎంఎల్​ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కిస్టు నాయకుడు లెనిన్ 151వ జయంతి సందర్భంగా ఇల్లందు న్యూడెమోక్రసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కొంత కాలంగా పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు గ్రామ గ్రామాల్లోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.

పోలారం, కొమరారం, సత్యనారాయణపురం, ముకుందాపురం, ధర్మపురం, మిట్టపల్లి, వీరాపురం ముత్తార కట్ట, నాయకులగూడెం, మసి వాగు గ్రామాల్లో పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. నేటి సామాజిక పరిస్థితులు అవగాహన చేసుకుని బలమైన ప్రజా పోరాటాల అమరవీరుల స్మరణతో ప్రజా ఉద్యమాలకు అంకితమవుదామని నేతలు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ ట్యాంకు లీకేజీ... 24 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.