ETV Bharat / state

ఆస్పత్రి నుంచి మాయమైన కరోనా బాధితుడు - corona patient hulchal

కరోనా సోకిన ఓ వృద్ధున్ని ఆస్పత్రిలో పెట్టగా... ఆ వాతావరణం నచ్చని బాధితుడు తప్పించుకున్నాడు. ఇంకేముంది... విషయం తెలిసి వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అంతా గాలించారు. చివరికి పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.

corona-patient-absconded-from-kothagudem

author img

By

Published : Aug 23, 2020, 10:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 70 ఏళ్ల కరోనా బాధితుడు హల్​చల్​ చేశాడు. పట్టణానికి చెందిన వృద్ధునికి కరోనా సోకగా... మూడు రోజుల క్రితం ఇల్లందు నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వాతావరణంలో ఉండలేక ఆ వృద్ధుడు... ఆస్పత్రి నుంచి తప్పించుకొని ఇల్లందుకు చేరుకున్నాడు.

బాధితుడు కన్పించటం లేదని తెలుసుకుని ఉరుకులు పరుగులు పెట్టటం వైద్య సిబ్బంది వంతైంది. అన్ని ప్రాంతాల్లో వెతుకుతుండగా... వృద్ధుడు ఇల్లందు బస్​స్టాండ్​లో ఉన్నాడని సమాచారం వచ్చింది. 108 సిబ్బంది హుటాహుటిన ఇల్లందు బస్టాండ్​కు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కొత్తగూడెం నుంచి బస్సులో వచ్చిన విషయం తెలుసుకుని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.