భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) నిర్మాణ పనులు జూన్‌లోగా పూర్తవుతాయని జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సచ్చిదానందం స్పష్టం చేశారు. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌ని ఆయన సింక్రనైజేషన్ చేశారు. ఆ సమయంలో 33.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ని గ్రిడ్‌కి అనుసంధానించారు.
సింక్రనైజ్ విజయవంతం కావడం పట్ల జెన్కో, బెల్ ఇంజినీర్లను ఆయన అభినందించారు. మార్చిలోగా యూనిట్ 3 సీఓడీ, యూనిట్ 4 సింక్రనైజేషన్.. జూన్‌లోపు నాలుగో యూనిట్ సీఓడీ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ. 684 కోట్లతో నిర్మించిన ఎఫ్‌జీడీ నిర్మాణ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. రైలు మార్గం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, భూ సేకరణ జరగగానే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చూడండి: పేకాటలో ఉద్రిక్తం.. కోడి పందేల్లో యువకుల వివాదం