భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు జనరల్ మేనేజర్ సత్యనారాయణ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. సింగరేణి ఇల్లందు ఏరియాలో మొత్తం 106 మంది ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటివరకు 96 మందికి వివిధ ప్రాంతాల్లో నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
ఇప్పుడు నియామక పత్రాలు పొందినవారు శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనుల్లో పనిచేయుటకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'