భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏడుగురు కార్మిక వారసులకు కారుణ్య నియామకాలను జనరల్ మేనేజర్ సత్యనారాయణ అందజేశారు. అనారోగ్య కారణాల వల్ల పదవి విరమణ పొందిన కార్మిక వారసులకు శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనులలో పనిచేయుటకు ఉత్తర్వులను అందజేశారు.
ఉద్యోగ నియామకాలు అందించినందుకు ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలని, తల్లిదండ్రులను చూసుకోవాలని జనరల్ మేనేజర్ అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్