ETV Bharat / state

CM KCR Speech at Nagarkurnool : 'త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తాం' - నాగర్​కర్నూల్ కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Visits Nagar Kurnool Today : గతంలో వలసలు, కరవుకు నిలయమైన పాలమూరు జిల్లాలో ప్రస్తుతం అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. అన్ని రంగాల కృషి సమాహారంగా అనేక అద్భుతాలు చేశామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి... తెలంగాణని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ఆ దిశగా అందరం పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు.

ే
CM KCR
author img

By

Published : Jun 6, 2023, 6:29 PM IST

Updated : Jun 6, 2023, 9:04 PM IST

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తాం : కేసీఆర్

CM KCR Nagar Kurnool Tour Today : నాగర్‌ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో నాగర్‌కర్నూల్ చేరుకున్న సీఎం కేసీఆర్... మొదటగా బీఆర్​ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్​ఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును కుర్చిలో కూర్చొబెట్టి ఆశీర్వదించారు.

CM KCR Inaugurate Nagar Kurnool New Collectorate : అనంతరం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 35 కోట్లు వెచ్చించి... నూతనంగా నిర్మించిన పోలీసు శాఖ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్‌ చౌరస్తాలో 52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను ఛాంబర్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఉదయ్ కుమార్‌కి అభినందనలు తెలిపారు. 12 ఎకరాల సువిశాల స్థలంలో లక్షా 25 వేల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. అక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి ప్రతిఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించినట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ, వ్యవసాయం, ఐటీ సహా వివిధ రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదు చేసినట్లు వివరించారు. సంపదను పెంచుదాం... ప్రజలకు పంచుదామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... 9 ఏళ్లలో చూపిన స్ఫూర్తి మున్ముందు కొనసాగిద్దామని తెలిపారు. ఆ దిశగా అందరం కష్టపడి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు.

'ఘనంగా 19వ కలెక్టరేట్‌ ప్రారంభించుకున్నాం. త్వరలో గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లు పూర్తవుతాయి. తెలంగాణ అనేక రంగాల్లో అగ్రభాగాన ఉంది. కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ పురోగతిపై ఇటీవల నాస్‌కామ్‌ నివేదిక ఇచ్చింది. దేశంలో 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలో వస్తుంది. గతంలో వలసలు, కరవుకు నిలయంగా పాలమూరు ఉండేది. ప్రస్తుతం పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయి. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తాం.'-సీఎం కేసీఆర్

పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల కృషి సమాహారంగా అనేక అద్భుతాలు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామన్న కేసీఆర్​... మిషన్‌ భగీరథలో అద్భుతాలు సాధించామని వ్యాఖ్యానించారు. సంపదను పెంచుదాం... ప్రజలకు పంచుదామన్నారు. అహర్నిశలు కృషిచేసిన ఉద్యోగులకే కీర్తి దక్కుతుందని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నాగర్​కర్నూల్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయలుదేరారు. ఈ ప్రగతి నివేదన సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రకటనలు చేసే అవకాశం ఉందని స్థానిక ప్రజలు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.