Batti on family suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవేందర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వనమా కుమారుడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ లేఖలో ఉందని తెలిపారు.
batti on palvancha suicide: ఈ ఘటనపై ప్రజలు కూడా స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలని భట్టి పిలుపునిచ్చారు. ఉద్యమాల గడ్డ కొత్తగూడెంలో ఇలాంటి దారుణమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన భట్టి విక్రమార్క.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
ఈ ఘటనపై కచ్చితంగా సీఎం కేసీఆర్తో మాట్లాడుతా. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ. ఇలాంటి వాటి కోసమా? ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తారా? ఇలాంటి దారుణాలపై అందరూ స్పందించాలి. ప్రభుత్వం, కలెక్టర్, ఎస్పీ, స్పందించాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలను నిలదీయాలి. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- భట్టి విక్రమార్క , సీఎల్పీ నేత